సెట్స్ లోకి ఒక్కసారి అడుగు పెడితే ఎనలేని ఎనర్జీతో షూట్ లో మాస్ మహారాజ్ రవితేజ పాల్గొంటారని రవితేజ కో స్టార్స్ ఎన్నో సార్లు చెప్పిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. అలాంటి రవితేజ ఇప్పుడు ఒక సరైన హిట్ కొట్టాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యిపోయారో ఏమో కానీ తాను ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “క్రాక్”ను మాత్రం సాలిడ్ గా రెడీ చేస్తున్నారు.
ఇప్పటికే పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉండనుంది అని అందరికి ఒక స్పష్టమైన క్లారిటీ ఉంది. ఇటీవలే ఫైనల్ షూట్ ను స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ ఎప్పటికపుడు మంచి అప్డేట్ తో అదరగొడుతుంది. అలా ఇప్పుడు లేటెస్ట్ గా ఈ చిత్రంలో మాస్ బీట్ ఐటెం సాంగ్ తో బిజీగా ఉన్నట్టు తెలిపారు.
మాస్ బీట్స్ లో కానీ ఐటెం సాంగ్స్ ఇవ్వడంలో కానీ థమన్ దిట్ట అలాంటి థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడం పైగా ఈ స్పెషల్ సాంగ్ అప్సర రాణి చేస్తుంది. ఇవన్నీ చూస్తుంటే క్రాక్ సినిమాతో రవితేజ ఖచ్చితంగా హిట్ అందుకోవడం ఖాయం అని ఫ్యాన్స్ మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో మరోసారి రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.