చిరంజీవి నా కొడుకు లాంటివాడు – దాసరి

chiranjeevi-dasari
చిరంజీవి మరియు తనకి మధ్యలో గొడవ ఉంది అని వచ్చిన పుకార్లను దాసరి నారాయణ రావు ఖండించారు. ఈ మధ్య దాసరి ఒకానొక ప్రెస్ మీట్ లో పేరు తెలుపకుండా పలువురిని విమర్శించారు. వెంటనే అయన చిరంజీవిని ఉద్దేశించి ఈ విమర్శలు చేశారన్న వార్తలు వచ్చాయి. కాని ఇప్పుడు దాసరి నారాయణ రావు ఈ వార్తలను ఖండించారు ” నాకు , చిరంజీవికి మధ్య గొడవలు పెట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తారో నాకు అర్థం కాదు చిరంజీవి నాకు కొడుకు లాంటి వాడు దయచేసి గొడవలు సృష్టించకండి” అని అన్నారు. వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నట్టు వార్తలు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో రామ్ చరణ్ మరియు దాసరి పరస్పర విమర్శలు చేసుకున్నారని వార్తలు వచ్చాయి కాని ఇప్పుడు దాసరి చేసిన కామెంట్స్ చూస్తుంటే అన్ని సర్దుకున్నట్టే కనిపిస్తుంది.

Exit mobile version