తను స్వయంగా రచించిన మరియు దర్శకత్వం వహించిన చిత్రాల గురించి కమల్ హాసన్ ఎప్పుడు ఒకడుగు ముందే ఉంటారు. గతంలో కమల్ “దశావతారం” చిత్రంలో పది పాత్రలతో ప్రేక్షకుడిని ఆశ్చర్యంలో ముంచారు ఆ చిత్రానికి అయన చేసిన ప్రచారం కూడా అందరికి చిత్రాన్ని చేరువయ్యేలా చేసింది. కాని ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి రికార్డ్స్ ని బద్దలు కొట్టలేదు. అయన రాబోతున్న చిత్రం “విశ్వరూపం” చిత్ర విషయంలో ఇది జరగకూడదు అనుకున్నారు. అందుకే అయన ఈ చిత్రాన్ని భారీగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. 95 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 150 కోట్ల వరకు వసూలు చెయ్యాలని కమల్ ఆశిస్తున్నారు. ఇప్పటి వరకు దక్షిణాదిన రజినీకాంత్ “ఎందిరన్” మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్ల మార్క్ దాటింది. మూడు భాషల్లో విడుదల అవుతుంది కాబట్టి “విశ్వరూపం” చిత్రానికి 150 కోట్ల మార్క్ చేరుకునే అవకాశం ఉంది. ఇదే కారణంగా ఈ చిత్రాన్ని ధియేటర్లలో కన్నా ముందే DTH లో విడుదల చేస్తున్నారు. 1000 రూపాయల ప్రీమియర్ క్లిక్ అయితే ఈ చిత్రం అనూహ్యమయిన వసూళ్లు రాబట్టడమే కాకుండా చిత్రం థియేటర్లో విడుదలకు ముందే 50 కోట్ల వసూళ్లను రాబట్టుతుంది. కమల్ హసన్ ఈ చీత్రన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించడమే కాకుండా ప్రధాన పాత్ర కూడా పోషించారు. పూజ కుమార్, ఆండ్రియా జేరేమియా, రాహుల్ బోస్ ప్రధాన పాత్రలు పోషించారు. శంకర్ ఎహాసన్ లాయ్ త్రయం ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం తమిళ వెర్షన్ జనవరి 11,2013 విడుదల కానుంది,