సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్ర షూటింగ్ దాదాపు చివరి దశలో ఉంది. కేవలం ఒక పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. వాన చినుకులు పడుతూ ఉంటే పాటను వెంకటేష్, అంజలి మీద కేరరలోని చలకుడి ప్రాంతంలో ఈ రోజు చిత్రీకరణ ప్రారంభించారు. అలప్పి ప్రాంతంలో కూడా ఈ పాటని షూట్ చేయనున్నారు. ఈ రోజు నుండి 21 వరకు ఈ పాట షూట్ చేస్తారు. ఈ పాటతో షూటింగ్ పార్ట్ పూర్తయినట్లే. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మిక్కీ జే మేయర్ అందించిన పాటలకి మంచి స్పందన వస్తుండగా మణిశర్మ నేపధ్య సంగీతం అందిస్తున్నాడు. జనవరి 11న సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కాబోతుంది.