వినూత్నమైన లుక్ లో వైవిధ్యమైన కథానాయకుడు !

వైవిధ్యమైన చిత్రాల కథానాయకుడు ‘నారా రోహిత్’ ఈ మధ్యాహ్నం, ఆకట్టుకునే తన వినూత్నమైన కొత్త లుక్ ను పోస్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. పొడవాటి గడ్డంతో మోనోక్రోమ్ ఫ్రేమ్ లో రోహిత్ చాల కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ కొత్త లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఈ కొత్త లుక్ తన కొత్త సినిమా కోసమని తెలుస్తోంది. బాణం చిత్రం దర్శకుడు చెైతన్య దంతులూరి దర్శకత్వంలో 1971 కాలంలో యుద్ధం నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ చిత్రంలో నారా రోహిత్ నటించబోతున్నాడట.

నవంబర్ నుండి ఈ చిత్రం పట్టాలెక్కనుందట. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందట. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని చెైతన్య దంతులూరి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మరి ఈ సినిమా చేస్తున్నారట. దర్శకుడిగా చెైతన్య దంతులూరి తన మొదటి చిత్రమైన ‘బాణం’ చిత్రంతోనే చెైతన్య మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత బసంతి చిత్రంతోనూ తాను టాలెంటెడ్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నే ప్రయత్నం చేశాడు.

అయినా చెైతన్య దంతులూరి కమర్షల్ గా మాత్రం సక్సెస్ సాధించలేకపోయాడు. అందుకే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని చెైతన్య దంతులూరి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మరి ఈ సినిమా చేస్తున్నాడట. మరి ఈ సారీ అన్న రోహిత్ కి – చైతన్యకు హిట్ వస్తోందో లేదో చూడాలి.

Exit mobile version