‘బిగ్ బాస్ 4’: ఒకరు ఎలిమినేట్ ఇంకొకరు ఎంట్రీ !

‘బిగ్ బాస్ 4’ నుండి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయాడు. అందరూ ఊహించినట్లుగానే, ఈ రోజు రాత్రి బిగ్ బాస్ ఇంటి నుండి ఎలిమినేట్ అయిన మొదటి హౌస్‌మేట్ దర్శకుడు సూర్య కిరణే. హోస్ట్ నాగ్ సూర్య కిరణ్ తొలగింపును ప్రకటించగా, మిగతా హౌస్‌మేట్స్ అందరూ తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఇంటి నుండి బయటకు వచ్చిన తరువాత, సూర్య కిరణ్ నాగార్జునను కలుసుకున్నాడు. నాగ్ కూడా మొదటి కంటెస్టెంట్ ఎలిమినేట్ పై తన నిరాశను వ్యక్తం చేశాడు. ఇక సూర్య కిరణ్ హౌస్‌మేట్‌ లను జంతువులతో పోల్చడటం, అలాగే గంగవ్వ గురించి స్పూర్తినిచ్చేవిధంగా అతను ఇచ్చిన వివరణ బాగుంది.

ఇక సూర్య కిరణ్ నిష్క్రమించిన వెంటనే, నాగ్ యువ హాస్యనటుడు సాయిను వైల్డ్-కార్డ్ ద్వారా బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశించే విషయాన్ని వెల్లడించాడు. మొత్తానికి బుల్లి స్క్రీన్ ను ఉరూతలు ఊగించడానికి బిగ్ బాస్ షో రోజురోజుకు ఆసక్తిగా సాగుతొంది.

Exit mobile version