ఆ దర్శకునికి అల్లు అరవింద్ ఆఫర్.?

దర్శకునిగా తన మొదటి చిత్రంతోనే టాలీవుడ్ మంచి మార్కులు అందుకున్నాడు కరుణా కుమార్. తన మొదటి చిత్రం “పలాస 1978” తోనే టాలీవుడ్ హాట్ టాపిక్ అయిన ఈ దర్శకుడు కొంతమంది ప్రముఖ నటులతో వెబ్ సిరీస్ ను కూడా ప్లాన్ చేసారని టాక్ వినిపించింది. అలాగే ఇప్పుడు ఈ దర్శకునికి మన టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఒక మంచి ఆఫర్ ఇచ్చినట్టుగా టాక్ వినిపిస్తుంది.

మన తెలుగు నుంచి మొట్ట మొదటి స్ట్రీమింగ్ యాప్ గా “ఆహా” ను అల్లు అరవింద్ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. మొత్తం తెలుగు సినిమాలు మరియు తెలుగు వెబ్ సిరీస్ కంటెంట్ తో ఈ యాప్ మన దగ్గర డీసెంట్ గా రన్ అవుతుంది. అయితే ఈ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ కోసం మంచి కంటెంట్ ఉన్న కథలను సిద్ధం చేయమనవలసిందిగా కరుణా కుమార్ కు అల్లు అరవింద్ ఆఫర్ ఇచ్చినట్టు వినికిడి. మరి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉంది.

Exit mobile version