మన దక్షిణాదిలోని ప్రధాన సినీ ఇండస్ట్రీలలో కన్నడ ఇండస్ట్రీ కూడా ఒకటి. అయితే ఇటీవలే ఇదే ఇండస్ట్రీలో డ్రగ్స్ రాకెట్ బయటపడిన ఘటన ఎంతటి కలకలం రేపిందో తెలిసిందే. ఇపుడు ఇదే ఘటనకు సంబంధించి మరింత మంది పేర్లు బయటకొస్తుండడం మరింత సంచలంగా మారింది. అలా మన తెలుగు మరియు కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన ప్రముఖ హీరోయిన్ సంజనా గల్రాని పేరు బయటకొచ్చింది.
అక్కడి సిటీ క్రైమ్ బ్రాంచ్ వారి ఇన్వెస్టిగేషన్ లో ఆమె మేనేజర్ ప్రీతం శెట్టి ఇచ్చిన సమాచారం ప్రకారం ఆమె కూడా ఇందులో ఉందని తెలిసింది. దీనితో ఇప్పుడు ఆమెను తన ఇంట్లోనే సీసీబి అధికారులు విచారిస్తున్నారు. అలాగే ఒకవేళ కనుక ఈమె విషయంలో కీలక ఆధారాలు దొరికితే అరెస్ట్ వరకు వెళ్లే అవకాశం కూడా ఉందని టాక్ వినిపిస్తుంది. ఈ ప్రముఖ నటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో బుజ్జిగాడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “సర్ధార్ గబ్బర్ సింగ్” లాంటి చిత్రాల్లో నటించింది.