విలక్షణ నటుని మరణంపై మహేష్ ఎమోషనల్ ట్వీట్.!

మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎందరో విలక్షణ నటులు అయిన వారిలో జయప్రకాశ్ రెడ్డి గారు కూడా ఒకరు. ఒక విలన్ గా మాత్రమే కాకుండా కమెడియన్ గా కూడా ఎన్నో అద్భుత పాత్రలను పండించిన ఆయన గుంటూరులోని ఆయన స్వగృహం లో మరణించారని వచ్చిన వార్త ఒక్కసారిగా తెలుగు సినీ వర్గాలను షాక్ గురి చేసింది. దీనితో మన తెలుగు ఇండస్ట్రీ పెద్దలు సహా స్టార్ హీరోలు ఆయన అకాల మరణం పట్ల దిగ్భ్రాంతికి లోనయ్యారు.

అలా సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన మరణం పట్ల చింతిస్తూ ఒక ట్వీట్ ను పెట్టారు. జయప్రకాష్ రెడ్డి గారి మరణం చాలా బాధాకరం అని మన టాలీవుడ్ లో ఆయన ఒక ఫైనెస్ట్ నటుడు అని ఆయనతో పని చేసిన అనుభూతి చాలా బాగుంటుదని అలాగే ఆయన కుటుంబానికి మరియు ఆయన్ను అభిమానించే వారికి నా ప్రఘాడ సానుభూతిని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నానని తెలిపారు. అయితే జేపీ గారు ఈ ఏడాది కనిపించిన చివరి చిత్రం కూడా బహుశా సూపర్ స్టార్ మహేష్ తో “సరిలేరు నీకెవ్వరు” అనే చెప్పాలి. ఆ రకంగా కూడా మహేష్ మరింత ఎమోషనల్ అయ్యారు.

Exit mobile version