అంగరంగ వైభవంగా బిగ్ బాస్ షో ప్రారంభం !

ఎట్టకేలకు బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్ ప్రారంభం అయింది. ఇప్పటికే మొదటి ఎపిసోడ్ షూటింగ్ పూర్తవడం.. దానికి సంబంధించిన ప్రీమియర్ ప్రోమోను కూడా మాటీవీ యాజమాన్యం రిలీజ్ చేసింది. ఈ ప్రీమియర్ ప్రోమోను చూస్తేనే తెలుస్తుంది ఈసారి డబుల్ లోడెడ్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. కంటెస్టెంట్ల పరిచయ అవ్వడం వాళ్లు హౌస్ లోకి కూడా వెళ్లడం జరిగిపోయింది. ఇక ఈ సీజన్ లో ఎవరెవరు కంటెస్టెంట్స్ గా వచ్చారో చూద్దాం. యూట్యూబ్ అవ్వగా తెలుగులో ఫుల్ ఫేమస్ అయిన గంగవ్వ, హీరో గోపీచంద్ కి మొదటి హిట్ ఇచ్చిన రణం సినిమా డైరెక్టర్ ‘అమ్మ రాజశేఖర్’ కూడా ఈ షోకి రాబోతున్నాడు.

అలాగే హారిక, అలాగే స్మాల్ స్క్రీన్ నుంచి టీవీ 9 యాంకర్ గా ఎదిగిన దేవి, మరియు లాస్య కూడా షోలో పాల్గొనబోతున్నారు. అదే విధంగా బుల్లితెర ననటీనటుల నుండి సుజాత(జోర్దార్ షో), అరియానా గ్లోరీలు కూడా షోకి వస్తున్నారు. ప్రముఖ నటుడు మరియు తెలుగు ర్యాప్ సింగర్ నోయెల్, నటి కరాటే కళ్యాణి మరియు మోనాల్ గజ్జర్ లు ఈ సారి షోలో అలరించనున్నారు.

Exit mobile version