దాదాపు ఐదు నెలలు దాటేసింది సినిమా థియేటర్స్ మూసుకుపోయి. అలాగే లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగులు కూడా నిలిచిపోవడంతో అసలు ఊహింహాని విధంగా మన దేశంలోని సినిమా పరిస్థితి మారిపోయింది. దీనితో మళ్ళీ సినిమా థియేటర్స్ మరియు సినీప్లెక్స్ లు ఎప్పుడు తెరుస్తారా అని అనేక మంది ఎదురు చూస్తున్నారు.
ఇపుడు దేశ వ్యాప్తంగా తగు జాగ్రత్తలతో సినిమా షూటింగులకు అనుమతులు అయితే వచ్చాయి కానీ ఇంకా సినిమా థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయి అన్న దానికి సంబంధించి ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇపుడు అందుకు సంబంధించే జాతీయ స్థాయి నిపుణులతో కలిసి ఒక కీలక వీడియో కాన్ఫరెన్స్ భేటీ ఈ సెప్టెంబర్ 8 వ తారీఖున న్యూ ఢిల్లీలో జరగనుంది అని అధికారిక సమాచారం బయటకు వచ్చింది.
ఈ వీడియో కాన్ఫరెన్స్ మీట్ లో సినీ రంగానికి సంబంధించిన అధికారులతో ఆయా ఇండస్ట్రీలకు చెందిన పెద్దలు పాల్గొననున్నారు. అలా మన టాలీవుడ్ నుంచి ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ గారు పాల్గొననున్నట్టుగా ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. మరి ఈ మీటింగ్ అనంతరం థియేటర్స్ ఎప్పుడు తెరుచుంటాయి అన్న దానికి సంబంధించి ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి.