ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం”వకీల్ సాబ్”. చాలా కాలం తర్వాత పవన్ నుంచి ఈ చిత్రం వస్తుండడంతో పవన్ కెరీర్ లో ఈ చిత్రం మోస్ట్ అవైటెడ్ గా మారింది. దర్శకుడు శ్రీరామ్ వేణు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రం తాలూకా మోషన్ పోస్టర్ టీజర్ ఈ మధ్యనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే.
గత సెప్టెంబర్ 2వ తారీఖున విడుదల చేసిన ఈ మోషన్ పోస్టర్ టీజర్ ఇంకా యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో నిలవడం విశేషం. ఆరోజు పెట్టిన 6 గంటల్లోనే నెంబర్ 1 ట్రెండింగ్ లోకి వచ్చి ఇపుడు దాదాపు నాలుగు రోజులు కావస్తున్నా దగ్గరగా 3 మిలియన్ వ్యూస్ తో నెంబర్ 2 లో ట్రెండింగ్ అవుతుంది. దీనితో ఈ సినిమా పై పవన్ అభిమానులు ఎంతలా ఆసక్తి కనబరుస్తున్నారో మనం అర్ధం చేసుకోవచ్చు. ఈ చిత్రంలో నివేతా థామస్ మరియు అంజలిలు కీలక పాత్రలు పోషిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు తన డ్రీమ్ కాంబోగా నిర్మిస్తున్నారు.