కాస్త గట్టిగానే బన్నీ పాన్ ఇండియన్ ఎంట్రీ రీసౌండ్?

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి పాన్ ఇండియన్ ఎంట్రీలు గట్టిగానే ఉన్నారు. ముఖ్యంగా అయితే బాలీవుడ్ మార్కెట్ వైపే మన తెలుగు హీరోల దృష్టి ఎక్కువగా ఉంది. అయితే ఇప్పటి వరకు హిందీలో ఒక్క సినిమా కూడా తియ్యకుండా అక్కడి ప్రేక్షుకుల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మన టాలీవుడ్ హీరో ఎవరన్నా ఉన్నారు అంటే అది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే అని చెప్పాలి. బన్నీ హిందీ డబ్బింగ్ సినిమాలకు వారి దగ్గర మంచి క్రేజ్ ఉంది.

అందుకే బన్నీ ఇక ఆలస్యం చెయ్యకుండా “అల వైకుంఠపురములో” చిత్రం తర్వాత రెండు భారీ పాన్ ఇండియన్ చిత్రాలను అనౌన్స్ చేసేసి హాట్ టాపిక్ అయ్యారు. అయితే బన్నీకు అక్కడ నుంచి సాలిడ్ వెల్కమ్ దక్కనుంది అన్ని మరోసారి ప్రూవ్ అయ్యింది. లేటెస్ట్ గా స్ట్రీమింగ్ వరల్డ్ లో విడుదలైన “వి” లో బన్నీ హిందీ రిఫరెన్స్ చూసి అభిమానులు గట్టిగా ఫిక్స్ అయ్యిపోయారు. బన్నీ క్రేజ్ అక్కడ ఏమాత్రం అంత ఎక్కువ లేకపోతే ఆ సీన్ పెడతారని ఇపుడు చర్చ నడుస్తుంది. దీనితో అల్లు అర్జున్ పాన్ ఇండియన్ ఎంట్రీ రీసౌండ్ గట్టిగానే ఉండేలా ఉందని చెప్పాలి.

Exit mobile version