నితిన్ సినిమాకు మరో సీనియర్ హీరోయిన్ పేరు.?

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ ఇటీవలే ఒక ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. అలాగే తన లాస్ట్ చిత్రం “భీష్మ” తో సాలిడ్ కం బ్యాక్ హిట్ అందుకున్న నితిన్ మళ్ళీ అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా పలు ప్రాజెక్టులను కూడా తన లైన్ లో ఉంచుకున్నారు. అయితే వాటిలో బాలీవుడ్ హిట్ చిత్రం అంధధూన్ రీమేక్ కూడా ఒకటి. ఈ చిత్రంపై మొదటి నుంచీ మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉండగా అదే మొదటి నుంచి ఈ చిత్రంలో ఒక కీలక రోల్ కు గాను సీనియర్ నటి టబు పేరు వినిపిస్తూ వచ్చింది. కానీ ఇదే రోల్ కు మరింత మంది సీనియర్ హీరోయిన్స్ పేర్లు కూడా వినిపించాయి. అలా ఇప్పుడు లేటెస్ట్ మరో సీనియర్ నటి రంభ పేరు కూడా వినిపిస్తుంది. ఈమె టబు రోల్ ను రీప్లేస్ చేసే అవకాశం ఉందని బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నారు.

Exit mobile version