“దిశా ఎన్కౌంటర్” తో వర్మ వేరే చెప్పాలనుకుంటున్నాడా?

ఈ లాక్ డౌన్ సమయంలో కూడా తన సినిమాలతో సంచలనం రేపిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పలు రాజకీయ మరియు నిజ జీవిత ఘటనలపై సినిమాలు తీస్తూ ఎప్పటికప్పుడు సరికొత్త కాంట్రవర్సీలకు తెరలేపుతున్నాడు. అలాగే పలు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు అనంతం పలు సున్నితమైన అంశాలను ఎన్నుకొన్నారు. అలాగే “మర్డర్” చిత్రాన్ని అనౌన్స్ చేసిన తనకి కావాల్సిన అటెన్షన్ ను తెచ్చుకున్నాడు.

ఇపుడు మళ్ళీ అలాగే గత ఏడాది కలకలం రేపిన దిశా ఘటనపై “దిశా ఎన్కౌంటర్” అనే చిత్రాన్ని ప్రకటించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసాడు. అయితే వర్మ ఇలాంటి సున్నితమైన మరియు సెన్సేషన్ రేపిన ఘటనలను సినిమాలుగా ఎంచుకున్నప్పుడు కావాల్సిన అటెన్షన్ వస్తుంది. కానీ సినిమాలో మాత్రం వేరే కోణాన్ని చూపిస్తున్నాడు. ఇపుడు అలాగే ఈ చిత్రానికి కూడా ప్లాన్ చేస్తున్నాడేమో అని చెప్పాలి.

ఈ ఘటన కోసం అందరికీ తెలిసిందే అందుకే కేవలం ఆమెపై మాత్రమే కాకుండా అసలు ఆ ఘటన జరగడానికి ప్రధాన కారణం అయినటువంటి వారిని ఎలా హతమార్చారు అన్నదానిపైనే తీసే యత్నం చేస్తున్నాడేమో అని చెప్పొచ్చు. మరి వర్మ మళ్ళీ ఎమన్నా తేడా చేస్తే ఖచ్చితంగా ఏదోకటి అవుతుంది. ఇదిలా ఉండగా ఈ చిత్ర టీజర్ ను వచ్చే సెప్టెంబర్ 26 న విడుదల చేయనుండగా సినిమాను నవంబర్ 26 న విడుదల చేస్తున్నట్టుగా తెలిపారు.

Exit mobile version