నాచురల్ స్టార్ నాని మరియు సుధీర్ బాబులు మెయిన్ లీడ్స్ లో అదితిరావు హైదరి మరియు నివేతా థామస్ లు హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “వి” ఇంకొన్ని గంటల్లో డైరెక్ట్ స్ట్రీమింగ్ వరల్డ్ లో దిగేందుకు సన్నద్ధం అవుతుంది. ఇప్పటి వరకు మన తెలుగు లో ఏ సినిమా స్ట్రీమింగ్ రీలీజ్ కోసం కూడా ఎవరు ఇంతలా ఎదురు చూడలేదు.
ఆ రేంజ్ లో ఈ చిత్రం మంచి హైప్ ను తెచ్చేసుకుంది. మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ చిత్రంలో సినీ ప్రేక్షకుల మధ్య రెండు ఫాక్టర్స్ మంచి హాట్ టాపిక్ గా అయ్యాయి. ఇప్పటికే ఈ చిత్రం క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉండనుంది అని అర్ధం అయ్యిపోయింది. అయితే ఇపుడు హాట్ టాపిక్ మారిన రెండు ఫాక్టర్స్ లో మొదటిది ఈ సినిమా టైటిలే..
మొదటి నుంచి జస్ట్ “వి” ప్రచారం కొనసాగుతుంది కానీ దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి అన్నది ఒక్క చిత్ర యూనిట్ కు తప్ప మరెవరికీ తెలియదు. ఇక అలాగే మరో మెయిన్ అంశం అసలు ప్రతినాయకుడు ఎవరు అన్నది. నానినే మొదటి నుంచి విలన్ గా చూపిస్తున్నా ఇంకా వేరే ఎవరో ఉండే ఉంటారు అని ప్రిడిక్షన్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ రెండు అంశాల వెనుక సస్పెన్స్ ఏమిటి అన్నది సినిమా చూసాకే తెలుస్తుంది.