స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించిన బిగ్గెస్ట్ మ్యూజికల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “అల వైకుంఠపురములో”. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబడిన ఈ చిత్రం భారీ రికార్డులను నెలకొల్పింది. ఒక్క బాక్సాఫీస్ మాత్రమే కాకుండా మ్యూజికల్ గా అయితే అనేక ఫస్ట్ ఎవర్ రికార్డులు నెలకొల్పింది.
దీనితో బన్నీ ఖాతాలో అనేక రికార్డులు వచ్చి పడ్డాయి. అయితే ఇప్పుడు అలాగే మరో ఫస్ట్ ఎవర్ సౌత్ ఇండియన్ రికార్డు పడింది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో మాస్ సాంగ్ “రాములో రాముల” కూడా పెద్ద హిట్ అయ్యింది. అయితే ఈ సాంగ్ లిరికల్ వీడియో 200 మిలియన్ వ్యూస్ తో అప్పుడు రికార్డు నెలకొల్పగా..
ఇప్పుడు ఫుల్ వీడియో సాంగ్ కూడా 200 మిలియన్ వ్యూస్ మార్క్ ను క్రాస్ చేసింది అలాగే 1 మిలియన్ లైక్స్ ను కూడా రాబట్టింది. ఇలా ఒక లిరికల్ సాంగ్ మరియు దానికి సంబంధించిన వీడియోకు కూడా అదే ఫీట్ అందుకోవడం అరుదు. ఇపుడు అదే రికార్డు బన్నీ ఖాతాలో పడింది. మరి అల వైకుంఠపురములో ఆల్బమ్ ఇంకెన్ని రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.