‘రాధే శ్యామ్’ షూట్ హాస్పిటల్ లోనే !

టాలీవుడ్ లో స్లోగా అందరూ షూటింగ్ కోసం కసరత్తులు చేస్తోన్నారు. అయితే ఈ లిస్ట్ లో నేషనల్ రేంజ్ లో స్టార్ డమ్ సాధించిన ప్రభాసే ముందుగా చేరేలా ఉన్నాడు. తన ‘రాధే శ్యామ్’ కోసం షూట్ కి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో 6 కోట్ల రూపాయిలు పెట్టి ఇప్పటికే ఓ భారీ హాస్పిటల్ సెట్‌ వేశారు. ఇప్పుడు ఇదే సెట్ లో షూట్ చేయనున్నారని తెలుస్తోంది. వచ్చే నెల 20 నుండి మొదలుకానున్న ఈ షెడ్యూల్ లో దాదాపు పది రోజుల పాటు ఇతర ఆర్టిస్ట్ ల పై షూట్ జరగనుందట

ఆ తరువాత ఈ హాస్పిటల్ సెట్‌ లోనే ప్రభాస్ పై కొన్ని కీలక యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తారని, ఈ సీన్స్ లో ప్రభాస్ పాత్ర వెరీ ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది. రాధాకృష్ణ కుమార్ అనే ‘జిల్’ మూవీ డైరెక్టర్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ పై ప్రభాస్ ఫ్యాన్స్ కి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఫ్యాన్స్ కి బాగా కనెక్ట్ అయింది. మరి రాధాకృష్ణ ఈ సినిమాని ఎలా తీస్తాడో చూడాలి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని నాలుగు భాషల్లో గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Exit mobile version