ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబులు మెయిన్ లీడ్స్ లో అదితిరావ్ హైదరీ మరియు నివేతా థామస్ లు హీరోయిన్స్ గా నటించిన చిత్రం “వి” డిజిటల్ ప్రీమియర్ గా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఎలాగో ఇక టైం దగ్గర పడుతున్న కొద్దీ ఈ చిత్రంపై అంచనాలు మరింత స్థాయిలో పెరుగుతున్నాయి. అయితే ఇప్పటికే ఈ చిత్రం ఒక క్రైమ్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉండనుంది అని అర్ధం అయ్యింది.
కానీ తర్వాత వచ్చిన ట్రైలర్ వచ్చాక మాత్రం వాటితో పాటు అదిరిపోయే యాక్షన్ చిత్రంగా కూడా ఇది ఉండనుంది అని అర్ధం అయ్యింది. కానీ దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి మాత్రం మరిన్ని ఎలిమెంట్స్ జోడించారట. అందులో ముఖ్యంగా ఈ చిత్రంలోని స్టైలిష్ మేకింగ్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ట్రైలర్ లో చూపిన విజువల్స్ చాలా రిచ్ గా అనిపించాయి. మరి ఈ చిత్రం ఎలా ఉండనుందో తెలియాలి అంటే వచ్చే సెప్టెంబర్ 5 వరకు ఆగాల్సిందే.