‘పుష్ప’ కోసం శ్రద్ధా కపూర్ ఒప్పుకుంటుందా ?

అల్లు అర్జున్ సుకుమార్ కలయికలో రానున్న ‘పుష్ప’ సినిమాలో ఎలాగైనా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం ఒప్పించాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. అయితే ఈ స్పెషల్ సాంగ్ లో శ్రద్ధా కపూర్ ను ఒప్పించాలని చూస్తున్నారు. శ్రద్ధా ఒప్పుకోకపోతే అప్షన్ గా బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలాను తీసుకోవాలనుకుంటున్నారు. ఇక ఈ సినిమా నుండి విజయ్ సేతుపతి తప్పుకున్న సంగతి తెలిసిందే.

కాగా విజయ్ సేతుపతి ప్లేస్ లో మాజీ హీరో మాధవన్ ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ చిత్రంలో బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఆమె గిరిజన యువతిగా కనిపించనుంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ సినిమాలో బన్నీ దొంగగా అలాగే పోలీస్‌ ఆఫీసర్‌ గా కూడా నటిస్తున్నాడట.

మొత్తానికి అన్ని ఇండస్ట్రీస్ నుండి స్టార్ లను తీసుకుని ఈ సినిమా రేంజ్ ను పెంచాలకుంటున్నారు. పైగా ‘రంగస్థలం’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్ నుండి ఈ పుష్ప సినిమా వస్తుండటంతో ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి.

Exit mobile version