మహేష్ మేనియాకు ఇదే నిదర్శనం. ఏకంగా ఇంటర్నేషనల్ తో క్రికెటర్ మహేష్ కి తనదైన శైలిలో విషెష్ తెలిపారు. కొన్నాళ్లుగా ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ హీరోల సాంగ్స్ కి ఇంస్టాగ్రామ్ లో డాన్స్ వేస్తూ దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. నేడు మహేష్ పుట్టిన రోజు నేపథ్యంలో ఆయన ఓ స్పెషల్ వీడియో చేశారు. నేడు మహేష్ బాబు ఈ రోజు తన 45 పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.
ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి తో పాటుగా పలువురు సెలబ్రెటీలు ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు. వాటిలో ప్రముఖ క్రికెటర్ తెలిపిన శుభాకాంక్షలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ లాక్ డౌన్ సమయంలో టిక్ టిక్ చేస్తూ అభిమానులను అలరించారు. అందులో భాగంగా మహేష్ బాబు చిత్రంలోని మైండ్ బ్లాక్ అనే పాటకు వార్నర్ తన భార్యతో కలిసి స్టెప్పులు వేసిన వీడియో ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. సూపర్ స్టార్ మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్డే లెజెండ్ మహేష్ అంటూ వార్నర్ విషెస్ తెలిపడం విశేషం.