“ప్రభాస్ 21” కు మరింత గ్రాండియర్ చేరనుంది.!


ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రెండు భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్టులు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వీటిలో దర్శకుడు నాగశ్విన్ తో చేస్తున్న తన 21 వ చిత్రం పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే సినిమా ప్లాట్ లైన్ కు సంబంధించి అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి.

వీటితో పాటుగా సినిమా క్యాస్టింగ్ విషయంలో కూడా నాగశ్విన్ గట్టిగానే ప్లాన్ చేసారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ను హీరోయిన్ గా ఈ చిత్రానికి సెలెక్ట్ చెయ్యగా ఇప్పుడు దర్శకుడు ఈ చిత్రానికి సంగీత దర్శకుని వేటలో పడ్డాడట. ఈ విషయంలో కూడా ఎక్కడా రాజీ పడకుండా ఉండాలని భావిస్తున్నారట.

అందుకే ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ ను కానీ లేదా “బాహుబలి” తో గ్రాండియర్ ఆల్బమ్ ఇచ్చిన ఎం ఎం కీరవాణి గారిని కానీ ఈ చిత్రానికి సంగీత దర్శకునిగా ఎన్నుకోవాలని ఆలోచనలో ఉన్నారట. ఈ ఇద్దరూ ఇద్దరే ఓ భారీ సినిమాకు ఏ రేంజ్ సంగీతాన్ని ఇవ్వాలో వీరికి బాగా తెలుసు మరి వీరిలో ఎవరు కన్ఫర్మ్ అవుతారు అన్నది చూడాలి.

Exit mobile version