“అల వైకుంఠపురములో” చిత్రం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన తరుణం పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ “పుష్ప” తో మొదలు పెట్టారు. ఇదిలా ఉండగా ఈ సినిమా ఇంకా పూర్తి కాకుండానే బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో మరో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హాట్ టాపిక్ అయ్యారు.
ఓకే ఈ రెండు అంశాలు బన్నీ ఫ్యాన్స్ కు మంచ్చి జోష్ ఇచ్చినా వారు ఇంకో సినిమా విషయంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి ఈ రెండు సినిమాల కంటే ముందే “ఐకాన్” అనే చిత్రం ద్వారా బన్నీ పాన్ ఇండియన్ హీరోగా పరిచయం కావాల్సి ఉంది. కానీ అది పుష్ప తోనే మొదలు కావాల్సి వచ్చింది.
అలాగే ఇప్పుడు కొరటాల కూడా రేస్ లోకి వచ్చారు. దీనితో అసలు ఐకాన్ సినిమా ఉందా లేదా అని అనుమానాలు వస్తున్నాయి. అయితే వినిపిస్తున్న బజ్ ప్రకారం ఐకాన్ సినిమా వీటి తర్వాత ఉంటుందని తెలుస్తుంది. ఇదిలా ఉండగా బన్నీ కొరటాల ప్రాజెక్ట్ మీద మాత్రం అంచనాలు మామూలుగా ఏర్పడలేదు.