ఇప్పుడు ఒక్క మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచే చాలా సినిమాలు పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లుగా తెరకెక్కి విడుదలకు సిద్ధం కానున్నాయి. మన టైర్ 2 టాప్ హీరోల నుంచి కూడా పలు సినిమాలు ఉండడం విశేషం.
అయితే మన తెలుగులో ఉన్నట్టుగా దక్షిణాదిలో మరో బిగ్గెస్ట్ సినీ ఇండస్ట్రీ అయిన కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా ప్రాజెక్టులు తక్కువే వస్తున్నాయని చెప్పాలి. రజినీ కానీ కమల్ కానీ లేదా దర్శకుల్లో శంకర్ లాంటి దర్శకులు తీసినవి తప్ప అక్కడ నుంచి పాన్ ఇండియన్ ప్రాజెక్టులు తక్కువే వస్తుంటాయి.
కానీ ఈసారి అక్కడ మాస్ క్రౌడ్ పుల్లింగ్ హీరో అయిన థలా అజిత్ కుమార్ కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ “వలిమై” తో పాన్ ఇండియన్ ఎంట్రీ ఇవ్వడం కన్ఫర్మ్ అయ్యింది. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా ఊహించిన దానికంటే గట్టిగానే దర్శకుడు పి వినోథ్ తెరకెక్కిస్తున్నారట. ఇది అజిత్ కు మొట్టమొదటి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కాగా ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కోసం థలా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.