“పవర్ స్టార్” దెబ్బకు మరో షాక్ తిన్న ఆర్జీవీ.!

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన సినిమా “పవర్ స్టార్” ఎంతలా సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. పెను దుమారం రేపిన ఈ చిత్రం వర్మ విషయంలో పీకల వరకూ వచ్చింది. అయినప్పటికీ వర్మ తాను అనుకున్నట్లు గానే ఆ చిత్రాన్ని విడుదల చేశాడు.

అయితే తన సినిమాలతో అందరికి షాక్ లు ఇచ్చే వర్మ ఓ ఛాలెంజ్ చేసి పవన్ ఫ్యాన్స్ నుంచి ఊహించని షాక్ కు గురయ్యాడు. ఇప్పుడు ఇదే అనికుంటే తాను తీసిన పవర్ స్టార్ దెబ్బకే మరో 88 వేలు పోగొట్టుకోవాల్సి వచ్చిందట. ఈ సినిమా ప్రచారాలు కోసం ఆ సమయంలో పోస్టర్ లు ప్రదర్శించగా అందుకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని జిహెచ్ఎంసి వారు నాలుగు వేల రూపాయల జరిమానా కట్టాలని నోటీసులు పంపారు.

ఇప్పుడు ఇదే అనుకుంటే సెంట్రల్ ఎన్ఫోర్మెంట్ తనిఖీలో కూడా వర్మ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఈ పోస్టర్ లు ప్రచారం చేసుకున్నారని గ్రహించి వారు ఏకంగా వర్మకు 88 వేలు జరిమానా విధించారట. దీనితో తాను తీసిన “పవర్ స్టార్” దెబ్బే వర్మకు మరోసారి గట్టిగా తగిలింది అని చెప్పాలి.

Exit mobile version