బిగ్ బాస్ హోస్ట్ గా నాగ్ కి భారీ రెమ్యూనరేషన్

గత మూడు సీజన్లు సూపర్ సక్సెస్ కావడంతో బిగ్ బాస్ సీజన్ 4 కోసం యాజమాన్యం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సెలెబ్రిటీల వేట మరియు ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఇక బిగ్ బాస్ రియాలిటీ షో లో పాల్గొనేది వీరే అంటూ అనేక మంది సెలెబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అధికారిక లిస్ట్ వచ్చే వరకు ఈ సీజన్ లో పాల్గొనే వారెవరు అనేదానిపై స్పష్టత ఇవ్వలేము. కాగా ఈసారి కూడా బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున చేయడం ఖాయం అంటున్నారు. గత సీజన్ ని హైయెస్ట్ టి ఆర్ పి తో నడిపిన కింగ్ నాగార్జునే హోస్ట్ గా బెస్ట్ ఛాయిస్ అని స్టార్ మా భావిస్తోందట.

అలాగే ఈ సారి ఆయన రెమ్యూనరేషన్ కూడా భారీగా ఉండనుందని సమాచారం. నాగార్జున ఇకపై మొత్తం సీజన్ కి కాకుండా ఎపిసోడ్ వైజ్ గా రెమ్యూనరేషన్ తీసుకోనున్నారట. ఇక ఆయనకు ఎపిసోడ్ కి ఎంత తీసుకోనున్నారు అనే విషయంలో స్పష్టమైన సమాచారం లేకున్నప్పటికీ ఫ్యాన్సీ ప్రైస్ ఇస్తున్నారని వినికిడి. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కఠిన నిబంధనల మధ్య షో నిర్వహణ జరగనుంది. అలాగే హౌస్ సభ్యులకు కూడా భారీగా రెమ్యూనరేషన్ ఇవ్వనున్నారట.

Exit mobile version