కాపీ మరక ముందుగానే చెరిపేసుకున్న కెజిఎఫ్ 2


2018 లో దేశవ్యాప్తంగా అన్ని బాషలలో సంచలన విజయం సాధించిన కెజిఎఫ్ మూవీకి కొనసాగింపుగా కెజిఎఫ్2 వస్తుండగా, నేడు సంజయ్ దత్ పుట్టినరోజుని పురస్కరించుకొని అధీరాగా ఆయన లుక్ విడుదల చేశారు. కెజిఎఫ్ 2 లో ప్రధాన విలన్ అధీరా పాత్ర చేస్తున్న సంజయ్ లుక్ భయంకరంగా ఉంది. అధీరా గా సంజయ్ లుక్ కి సర్వత్రా ప్రసంశలు అందుతున్నాయి. కాగా అధీర లుక్ న వైకింగ్స్ స్పూర్తితో రూపిందించినట్లు చిత్ర యూనిట్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. దర్శక నిర్మాతలు అధీర లుక్ కి వైకింగ్స్ స్ఫూర్తి అని చెప్పడం వెనుక ఓ కారణం ఉందనిపిస్తుంది.

8వ శతాబ్దంలో నార్వే, స్వీడన్ ప్రాంతాలల్లో సంచరించిన ఓ భయంకరమైన తెగప్రజలను వైకింగ్స్ అంటారు. ఈ వైకింగ్స్ పై హాలీవుడ్ లో అనేక సినిమాలు రావడం జరిగింది. వారిని పోలి ఉండే లుక్ అధీరాకు డిజైన్ చేశారు. సోషల్ మీడియా యుగంలో ప్రతి విషయంలోని మూలలను అప్పుడే పట్టేస్తుండగా, నెటిజెన్స్ పోలికలతో రెచ్చిపోయి విమర్శలు చేయక మునుపే, కెజిఎఫ్ 2 మేకర్స్ తెలియజేశారు. దీనితో అధీరా లుక్ కాపీ అనే అవకాశం ఎవరికీ లేకుండా పోయింది.

Exit mobile version