2021 సంక్రాంతికి ఆర్ ఆర్ ఆర్ రూపంలో ఓ విజువల్ వండర్ ఎంజాయ్ చేద్దాం అనుకున్న సినీప్రేమికులకు నిరాశ తప్పేలా లేదు. కరోనా వైరస్ కారణంగా షూటింగ్స్ మొదలుకావడానికి సమయం పట్టేలా ఉంది. ఐతే లేటైనా కానీ రాజమౌళి బెటర్ అవుట్ పుట్ తో వస్తాడు అనేది ఉపశమనం కలిగించే అంశం. అందుకే ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ లేటైనా పర్లేదు, బెస్ట్ క్వాలిటీతో ఓ భారీ బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుంటున్నారు. ఇక ఈ మూవీని అనేక ఆసక్తికర అంశాలతో రాజమౌళి రూపొందిస్తున్నారు.
కాగా తాజా సమాచారం ప్రకారం, ఆర్ ఆర్ ఆర్ లో ఎమోషనల్ కంటెంట్ కూడా ఎక్కువే నట. అనుకోకుండా కలిసి అన్నదమ్ములుగా మారిన భీమ్, అల్లూరి మధ్య ఎమోషనల్ బాండింగ్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుందట. పతాక సన్నివేశాలలో భీకరమైన పోరాటాలతో పాటు వీరిద్దరి మధ్య నడిచే భావోద్వేగ సన్నివేశాలు కట్టిపడేస్తారని సమాచారం. ఇక 70శాతం వరకు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి అయ్యింది.