మెగా డాటర్ జోరు, మరో రెండు వెబ్ సిరీస్లు..!

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొన్నాళ్ల క్రితం చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. బేసిక్ గా ఆమె ఫ్యాషన్ డిజైనర్ కావడంతో తన తండ్రి చిరంజీవి నటిస్తున్న సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. చిరంజీవి కమ్ బ్యాక్ తరువాత నటించిన ఖైదీ 150 మరియు సైరా చిత్రాలకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేయడం జరిగింది. కాగా కొత్తగా ఆమె చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం విశేషం. దీనిలో భాగంగా ఆమె ఓ వెబ్ సిరీస్ నిర్మాణం మొదలుపెట్టారు.

కోవిడ్ ఆంక్షల మధ్య కూడా సుస్మిత ఆ వెబ్ సిరీస్ షూటింగ్ నిర్వహించారు. ఐతే ఆ టీమ్ సభ్యులలో కొందరికి కరోనా నిర్ధారణ కావడంతో, షూటింగ్ నిలిపివేశారు. కాగా సుస్మిత మరో రెండు వెబ్ సిరీస్ నిర్మాణానికి కూడా ప్రణాళికలు వేస్తున్నారట. త్వరలోనే వాటి వివరాలు ప్రకటిస్తారని సమాచారం అందుతుంది. ఇప్పటికే రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో మూవీస్ నిర్మిస్తూ ఉండగా, సుస్మిత కూడా పూర్తి స్థాయిలో నిర్మాతగా మారడం విశేషం.

Exit mobile version