‘కిక్’కి మించిన కామెడీ టైమింగ్ తో రవితేజ ?

‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రవితేజ సినిమా చెయ్యటానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని.. సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ కిక్ సినిమా నుండి ప్రేరణ పొంది రాసుకున్నారని.. కిక్ కి మించిన కామెడీ టైమింగ్ తో రవితేజ క్యారెక్టర్ ఉండబోతుందని తెలుస్తోంది. ఎలాగూ త్రినాథరావ్ నక్కిన గత చిత్రాలు కూడా ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్ వంటి సినిమాలు ఫుల్ ఎంటెర్టైమెంట్ తో సాగాయి. కామెడీని త్రినాథరావ్ బాగా హ్యాండిల్ చేస్తారు. ఇక రవితేజ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

నిజానికి కిక్ తరువాత రవితేజ మళ్లీ ఆ రేంజ్ కామెడీ సినిమా చెయ్యలేదు. మొత్తానికి ఈ సినిమా చేస్తే రవితేజకి మరో సూపర్ హిట్ గ్యారింటీ. పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ లోనే స్టార్ట్ అవ్వాల్సింది. కానీ, కరోనా వల్ల ఆలస్యం అయింది. కరోనా అనంతరం ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకి ఫుల్ స్క్రిప్ట్ ను అందించారు. అన్నట్టు రవితేజ రమేష్ వర్మ డైరక్షన్ లోనూ ఓ సినిమా చేస్తున్నాడు.

Exit mobile version