అమ్మ చెవితేనే లిప్ లాక్ కి ఒప్పుకుంటా అంటున్న హాట్ హీరోయిన్

2018లో వచ్చిన ఆర్ ఎక్స్ 100 అనే రొమాంటిక్ ట్రాజిక్ లవ్ డ్రామాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్. ఆ మూవీ సెన్సేషనల్ హిట్ కొట్టడంతో ఈ అమ్మడుకి మంచి ఫేమ్ వచ్చింది. ఆర్ ఎక్స్ 100లో ఆమె చేసిన గ్లామర్ అండ్ బోల్డ్ రోల్ కి యువత క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఆ మూవీ ఇచ్చిన మైలేజ్ తో చాలా సినిమాలే తెలుగులో చేసింది. ఐతే పాయల్ రాజ్ పుత్ సక్సెస్ రేట్ తక్కువ కావడంతో ఆమెకు స్టార్ హీరో రేంజ్ అవకాశాలు రాలేదు.

కాగా ఆర్ ఎక్స్ 100 తో పాటు ఆర్ డి ఎక్స్ లవ్ చిత్రాలలో పాయల్ లిప్ లాక్ సీన్స్ తో రెచ్చిపోయింది. తాజా ఇంటర్వ్యూలో ఈ సన్నివేశాలపై అడిగిన ప్రశ్నకు పాయల్ స్పందించారు. తను చేయబోయే మూవీలో లిప్ లాక్ వంటి ఇంటిమసీ సీన్స్ ఉంటే పాయల్, వాళ్ల అమ్మకు ముందుగానే చెవుతుంది అట. అప్పుడు వాళ్ళ అమ్మ పర్మిషన్ ఇస్తేనే ఆ సినిమాలలో నటిస్తుందట. పాయల్ ప్రస్తుతం తన ఫోకస్ కోలీవుడ్ పైకి మళ్లించింది.

Exit mobile version