సీనియర్ నటి, కర్ణాటక ఎంపీ సుమలత కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. ఆ విషయాన్ని సుమలత సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే ఆమె తనను ఆ మధ్య కాలంలో కలిసిన వారందరినీ కోవిడ్ టెస్టులు చేయించుకోవలసిందిగా కోరారు. అప్పటి నుండి ఆమె కోవిడ్ కి చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ఆవిడకు చేసిన కరోనా పరీక్షలో నెగెటివ్ వచ్చినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
దీనితో ఆమె అభిమానులు మరియు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. తమ అభిమాన నటి మరియు నేత సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అనేక మంది ప్రజా ప్రతినిధులు మరియు సినిమా ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. కరోనా వైరస్ కారణం ఇప్పటికే కొందరు నటులు చనిపోవడం విచారకరం.