ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇది బ్యాడ్ న్యూసే..?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న అంశం ఆర్ ఆర్ ఆర్ నుండి ఆయన ఫస్ట్ లుక్. ఎన్టీఆర్ బర్త్ డే కానుగా మే నెలలో విడుదల కావలసిన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ చిత్ర బృందం విడుదల చేయలేదు. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ విడుదలకు కావలసిన మెటీరియల్ తమ వద్ద లేదని, ఫస్ట్ లుక్ అందించలేమని ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఫ్యాన్స్ కి సంజాయిషీ ఇచ్చారు. ఐతే లాక్ డౌన్ అనంతరం షూటింగ్ మొదలైన తరువాత ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ విడుదల ఉంటుందని చెప్పడం జరిగింది. దీనితో ఫ్యాన్స్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఐతే అసలు 2020లో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలవుతుందా అనే కొత్త అనుమానాలు సినీ వర్గాలలో మొదలవుతున్నాయి. కారణం కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. దీనితో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఫస్ట్ ఈ ఏడాది కష్టమే అంటున్నారు. ఈ న్యూస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మరింత ఇబ్బంది పెట్టే అంశం అనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఎన్టీఆర్ ని తెరపైన చూసి రెండేళ్లు అవుతుంది.

Exit mobile version