వర్మ, పవన్ లపై నిఖిల్ సంచలన ట్వీట్..!

యంగ్ హీరో నిఖిల్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఒకరి ప్రవర్తన పట్ల ఘాటుగా స్పందించారు అని చెప్పాలి. ఆయన తన ట్వీట్ లో ”కుక్క ఎంత మొరిగినా..ఆ మహా శిఖరం తల తిప్పికూడా చూడదు, మీకు అర్థమైంది గా..” అని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో పవర్ స్టార్ మరియు పవన్ కళ్యాణ్ అనే యాష్ టాగ్స్ వాడడంతో పాటు, ఓ జిఫ్ వీడియో కూడా పోస్ట్ చేశారు.

హీరో నిఖిల్ ట్వీట్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఉద్దేశించే, అని అందరికీ అర్థం అవుతుంది. వర్మ పవర్ స్టార్ పేరుతో ఓ మూవీ చేయడంతో పాటు, హీరో పవన్ వక్తిత్వాని కించ పరిచేలా సాంగ్స్ మరియు ట్రైలర్స్ విడుదల చేశారు. పవన్ వీరాభిమానులలో ఒకరైన హీరో నిఖిల్ ఈ విషయంపై తన ఆవేశాన్ని ట్వీట్ రూపంలో ఇలా ప్రదర్శించారు అనిపిస్తుంది.

Exit mobile version