హీరోయిన్ గా దీపిక…ప్రభాస్ రియాక్షన్ ఏంటంటే?

ప్రభాస్ 21 మూవీలో హీరోయిన్ గా దీపికా పదుకొనె కన్ఫర్మ్ అయ్యింది. ఎన్నో రోజులుగా ప్రభాస్ 21లో హీరోయిన్ దీపక అంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఐతే నేడు దీనిపై అధికారిక ప్రకటన రావడం జరిగింది. ఇక దీపికాను హీరోయిన్ గా ప్రకటించడం పై ప్రభాస్ ఆసక్తికరంగా స్పందించారు. దీపికాతో వర్క్ చేయడానికి ఎంతో ఎక్సైట్ అవుతున్నాను. దీపికా నీకు వెల్కమ్ అని ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ చిత్రం కోసం దీపికా భారీమొత్తంలో అందుకున్నారని తెలుస్తుండగా… ఆమె రాకతో ఈ ప్రాజెక్ట్ కి మరింత క్రేజ్ వచ్చి చేరింది.

దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ యూనివర్సల్ సబ్జెక్టు తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించనున్నారు. దాదాపు 500కోట్లకు పైగా ఖర్చుతో ప్రభాస్ 21 తెరకెక్కనుంది. సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ 2022 లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ భాషలలో కూడా విడుదల చేయనున్నారని సమాచారం.

Exit mobile version