వచ్చే నెలలో మెగా ఫ్యామిలీ అభిమానులకు పెద్ద పండుగ వుంది. ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఆయన ఈ ఏడాది 65వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. కాగా ఇప్పటి నుండే చిరంజీవి పుట్టినరోజుకు ఫ్యాన్స్ ఏర్పాట్లు మొదలుపెట్టేశారట. ఆగస్టు 22న సోషల్ మీడియాలో దుమ్ములేపనున్న ఫ్యాన్స్ కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారని సమాచారం. ఇక చిరంజీవి బర్త్ డే సీడీపీ ఓ బాలీవుడ్ ప్రముఖుడు లాంచ్ చేస్తాడని తెలుస్తుంది. అలాగే ఫ్యాన్స్ ఓ సాంగ్ కూడా కంపోజ్ చేయిస్తున్నారట .
చిరంజీవి 65వ పుట్టిన రోజు సంబరాలు ఆకాశాన్ని అంటడం ఖాయంగా కనిస్తుంది. ఇక చిరంజీవి లేటెస్ట్ మూవీ ఆచ్యార నుండి ఫస్ట్ లుక్ కూడా ఆరోజు విడుదల కానుందని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.