బాలీవుడ్ లో దుమ్ము రేపుతున్న “సాహో”.!

బాహుబలి తో ప్రభాస్ కు బాలీవుడ్ లో అక్కడ స్టార్ హీరోల రేంజ్ స్టార్డం వచ్చేసింది. ఇక అదే ఊపులో యువ దర్శకుడు సుజీత్ తో “సాహో” అనే మరో భారీ యాక్షన్ థ్రిల్లర్ ను అనౌన్స్ చేసేసి ప్రభాస్ మరో భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ వస్తుందని ప్రకటించేశాడు. సినిమా విడుదల వరకు భారీ అంచనాలను నెలకొల్పుకున్న ఈ చిత్రం ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర మాత్రం పరాజయాన్నే చూడాల్సి వచ్చింది. కానీ బాలీవుడ్ లో మాత్రం ఈ చిత్రం లాభాల్లో తేలింది.

అక్కడి ప్రేక్షకులకు ఈ చిత్రం విపరీతంగా నచ్చే సరికి అక్కడ సిల్వర్ స్క్రీన్ పై ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ప్లాప్ టాక్ తో కూడా 400 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమాకు బాలీవుడ్ వసూళ్లే బాగా ప్లస్ అయ్యాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే ఆ స్థాయిలో ఈ సినిమాను వారు ఆదరించారు. ఇక ఇదే సినిమా స్మాల్ స్క్రీన్ వెర్షన్ కు వచ్చినట్టయితే అక్కడ కూడా దుమ్ము రేపింది అని చెప్పాలి.

ఇప్పటికి ఈ చిత్రం హిందీలో మూడు సార్లు టెలికాస్ట్ కాగా మూడు సార్లూ రికార్డు స్థాయి వ్యూవర్ షిప్స్ ను రాబట్టింది. మొట్ట మొదటిసారి ఈ చిత్రాన్ని అక్కడ టెలికాస్ట్ చెయ్యగా భారీ ఎత్తున 1 కోటి 28 లక్షల వ్యూవర్ షిప్స్ రాగా రెండో టెలికాస్ట్ లో 52 రెండు లక్షలకు పైగా ఇంప్రెషన్స్ రాబట్టి సత్తా చాటింది. ఇక అలాగే ఇటీవలే మూడోసారి టెలికాస్ట్ చేసినపుడు మాత్రం రెండో సారి కంటే భారీ ఎత్తున 83 లక్షల వ్యూవర్ షిప్స్ ను రాబట్టినట్టు తెలుస్తుంది. దీనితో బాలీవుడ్ లో సాహో చిత్రం ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉందని చెప్పాలి.

Exit mobile version