స్పెషల్ సాంగ్లో స్టెప్పు లేయనున్న నయనతార

రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత అందాల భామ నయనతార ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఒక హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. గత కొన్ని రోజులుగా నయనతార స్పెషల్ సాంగ్ చేస్తుందని వార్తలు వచ్చాయి కానీ ఇప్పటి వరకూ ఆమె ఎవరికీ అంగీకారం తెలుపలేదు. తాజా సమాచారం ప్రకారం తమిళ హీరో ధనుష్ నిర్మిస్తున్న ‘ఎదిర్ నీచ్చల్’ అనే సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయడానికి అంగీకరించింది. ఇందులో ధనుష్ ఓ స్పెషల్ పాటలో కనిపించనున్నాడు, తనతో పాటు నయనతార కూడా స్టెప్పు లేస్తే బాగుంటుందని ఆమెని అడగడంతో ఆమె అంగీకరించారు. ఈ సినిమా తెలుగులో డబ్ అయ్యి విడుదలయ్యే అవకాశం కూడా ఉంది.

Exit mobile version