అల్లు వంశం నుంచి ఇండస్ట్రీలోకి వస్తున్న మరో హీరో అల్లు శిరీష్. తను హీరోగా తెలుగువారి ముందుకు రానున్న సినిమా ‘గౌరవం’. రాధామోహన్ డైరెక్షన్లో యామి గౌతమ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఓ ప్రముఖ పత్రికతో ముచ్చటించిన శిరీష్ తన లాంచింగ్ మూవీ గురించి చెబుతూ ‘ ఒరిజినల్ స్టొరీతో నా మొదటి సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు చాలా రీమేక్ సినిమాల ఆఫర్లు వచ్చాయి కానీ నేను హీరోగా పరిచయమవుతున్న సినిమా రీమేక్ కాకూడదని వద్దనుకున్నానని’ అన్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమాని జనవరి చివరిలో విడుదల చేయనున్నారు.