డేరింగ్ సూర్య..పంతం నెగ్గించుకున్నాడు..!


హీరో సూర్య తన పంతం నెగ్గించుకున్నాడు. ఎవరెన్ని బెదిరించించినా తను చేయాలనుకున్నది చేస్తాడు అని రుజువు చేశాడు. కొద్దిరోజులుగా సూర్య మరియు తమిళనాడు థియేటర్స్ అసోసియేషన్ సభ్యుల మధ్య వివాదం నడుస్తుంది. జ్యోతిక ప్రధాన పాత్రలో ఆయన నిర్మించిన పోన్మగళ్ వందాల్ మూవీని నేరుగా డిజిటల్ ఫార్మట్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని తమిళనాడు థియేటర్స్ అసోసియేషన్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోని పక్షంలో సూర్య సినిమాలు నిషేదిస్తాం అని హెచ్చరించారు.

కేరళ థియేటర్స్ సంఘాలు కూడా వారికి మద్దతు పలకడంతో సూర్య పోన్మగళ్ వందాల్ చిత్రాన్ని ఓ టి టి లో విడుదల చేయడాన్ని నిలిపివేస్తాడు అని అందరూ అనుకున్నారు. ఐతే సూర్య ఆ బెదిరింపులకు భయపడకుండా తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. ఈ చిత్రం మే 29నుండి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతున్న ఫస్ట్ తమిళ్ మూవీ ఇదే కావడం విశేషం.

Exit mobile version