దేవిశ్రీని పెళ్లి ఎప్పుడు అని అడిగితే..!

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ఎప్పుడూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటారు. దశాబ్దానికి పైగా దేవిశ్రీ ఏకఛత్రాధిపత్యం చేస్తూ దూసుకెళుతున్నాడు. ఇక ఈ ఏడాది ఆయన మ్యూజిక్ అందించిన సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన సాంగ్స్ తెలుగు రాష్ట్రాలలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక అల్లు అర్జున్- సుకుమార్ ల పాన్ ఇండియా మూవీ పుష్ప కు కూడా ఆయనే మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఇక లాక్ డౌన్ కారణంగా ఇంటిలోనే ఉంటూ తన చిత్రాల మ్యూజిక్ వర్క్స్ ఆయన చూసుకుంటున్నారు. కాగా దేవిశ్రీ వయసు ప్రస్తుతం 40 సంవత్సరాలు. ఇంకా ఆయన బ్యాచ్ లర్ గానే ఉన్నారు. మరి పెళ్ళెప్పుడు చేసుకుంటారని అడిగితే తెలివిగా విషయం దాటవేస్తున్నాడు. పెళ్లి గురించి అడిగితే..ఆ ఒక్కటి అడగొద్దు అని సమాధానం చెవుతున్నారు. అలాగే మళ్ళీ ఎప్పుడూ పెళ్లి గురించి అడగకండి.. అందరూ అదే అడుగుతూ ఉంటారు అని తప్పించుకున్నాడు.

Exit mobile version