మహేష్ తన నెక్స్ట్ మూవీ దర్శకుడు పరుశురామ్ తో చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన మే 31న కృష్ణ గారి పుట్టిన రోజు కానుకగా వెలువడనుంది. అనేక మంది దర్శకుల నుండి కథలు విన్న మహేష్ చివరకు పరుశరామ్ తో కమిట్ అయ్యారు. మహేష్ కోసం ఆయన ఇమేజ్ కి తగ్గట్టు ఓ మాస్ కమర్షియల్ ఎంటరైనర్ సిద్ధం చేసినట్టు పరుశురామ్ ఇప్పటికే చెవుతున్నారు. ఐతే ఈ సినిమాలో మహేష్ పాత్ర గురించి ఓ ఆసక్తి కర ప్రచారం టాలీవుడ్ లో నడుస్తుంది.
మహేష్ మరో మారు స్టూడెంట్ గా కనిపిస్తాడట. అందుకోసం ఆయన కొంచెం బరువు కూడా తగ్గారని వినికిడి. ఈ మధ్య మహేష్ నటించిన శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి సినిమాలలో మహేష్ కొద్దీ సేపు స్టూడెంట్ గా కనిపించారు. పరుశురామ్ సినిమాలో కూడా మహేష్ ఇలానే కొంత నిడివి గల పాత్రలో స్టూడెంట్ గా చేస్తున్నారని వినిపిస్తుంది. మరి దీనిపై స్పష్టత రావాలంటే ఇంకొద్దిరోజు ఎదురుచూడాలి. ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు తో బ్లాక్ బస్టర్ కొట్టిన మహేష్ మంచి జోష్ లో ఉన్నారు.