దర్శకేంద్రుడు ఆ సినిమా సీక్వెల్ కి సిద్ధం అవుతున్నాడా?

టాలీవుడ్ నుండి గొప్ప విజయాలు నమోదు చేసిన చిత్రాలలో ఒకటైన జగదేకవీరుడు అతిలోకసుందరి నిన్నటికి విడుదలై 30ఏళ్ళు పూర్తి చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఈ చిత్రం అనేక ఇండస్ట్రీ రికార్డులు నమోదు చేసింది. ఈ సందర్భంగా కొన్ని రోజలుగా ఈ మూవీ విశేషాలను హీరో చిరంజీవి, దర్శకుడు రాఘవేంద్ర రావు, నిర్మాత అశ్వినీ దత్ పంచుకుంటున్నారు. ఈ చిత్ర విశేషాలు, సంగతులు తెలియజేస్తూ కొన్ని వీడియోలు కూడా వచ్చాయి.

కాగా ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని నిర్మాత అశ్వినీ దత్ ఇటీవలే తెలియజేశారు. ఈ సీక్వెల్ ని తెరకెక్కించే బాధ్యత కూడా రాఘవేంద్ర రావుకే అశ్వినీ దత్ అప్పగించారని సమాచారం. దీనితో దీనికి సంబందిచిన స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో రాఘవేంద్ర రావు ఉన్నారని వినికిడి. చరణ్ హీరోగా భారీ బుడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కించాలన్నది దర్శక నిర్మాతలతో పాటు, చిరంజీవి ఆలోచన కూడా అట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళడానికి ఎంతో దూరం లేదనే మాట వినబడుతుంది. చూడాలి మరి దీనిపై ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో.

Exit mobile version