వైజాగ్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరు, మహేష్.

నేడు ఉదయం సాగర నగరం వైజాగ్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ కెమికల్ ఫ్యాక్టరీ నుండి విషవాయువు లీకై గాలిలో చేరడంతో ఆ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అస్వస్థకు గురయ్యారు. దీనితో కొందరు ప్రాణాలు కోల్పోగా వందల సంఖ్యలో ఆసుపత్రి పాలయ్యారు. వీరికి మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ విషాద సంఘటనపై చిరంజీవి మరియు మహేష్ స్పందించారు. విశాఖ లో విషవాయువు బారినపడి ప్రజలు మరణించటం మనసుని కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. అస్వస్థతకు గురైన వారందరు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాము అన్నారు. ఆలాగే సంబంధిత అధికారులు దీని బారినపడ్డ వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుకున్నారు.

Exit mobile version