మహేష్ కి ఇష్టమైన సాంగ్ సితార ఎంత ముద్దుగా పాడిందో..!


లాక్ డౌన్ సమయంలో మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ వారి ఫ్యామిలీ ఫోటోలు, మహేష్ మరియు పిల్లలు సితార, గౌతమ్ అల్లర్లు, సరదా సందర్భాలు అన్నీ సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఎక్కువగా ఆమె మహేష్ గారాల పట్టి సితార చిన్నప్పటి వీడియోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు. అలాగే నేడు కూడా ఓ వీడియో నమ్రత పంచుకున్నారు. మహేష్ కి ఇష్టమైన సాంగ్ ని సితార వచ్చీ రాని ముద్దు మాటలతో పాడుతున్న వీడియో పోస్ట్ చేసింది.

సితార పాడుతున్న ఆ పాటను మహేష్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సితార చాలా చిన్నపిల్లగా ఉన్నప్పటి ఆ వీడియోని ప్రస్తావిస్తూ కళ్ళముందే పిల్లలు పెద్ద వారైపోతున్నారు అని అన్నారు. ఇక మహేష్ తన నెక్స్ట్ మూవీ దర్శకుడు పరుశురాం తో కమిట్ అయ్యారు. ఈనెల 31న కృష్ణ పుట్టిన రోజు కానుకగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చే సూచనలు కలవు.

Exit mobile version