అలా చేయ‌మంటే.. ఆ సినిమానే వ‌దిలేస్తా !

ఫిదా చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయిప‌ల్లవి.. ఒక్క సినిమాతోనే తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. భానుమతి.. హైబ్రిడ్ పిల్ల.. ఒక్కటే పీస్ అంటూ, యువతని మాయ చేసింది. ప్ర‌స్తుతం రానాతో విరాట‌ప‌ర్వం, నాగ‌చైత‌న్య‌తో ల‌వ్‌స్టోరీ చిత్రాల్లో న‌టిస్తోంది. సాయిపల్లవి నటనకి అవకాశం వుండే కథలను, సహజత్వానికి దగ్గరగా వుండే పాత్రలను మాత్రమే సాయిపల్లవి ఎంచుకుంటూ వెళుతోంది. గ్లామరస్‌గా కనిపించే విషయంలో మొదటి నుంచి కూడా తను అనుకున్న పరిధిని దాటకుండా జాగ్రత్తలు తీసుకుంటూ తన సినీ కెరీర్‌ను కొనసాగిస్తోంది

ఇక ఇటీవల‌ ఓ ఇంట‌ర్వ్యూలో భాగంగా సాయి పల్లవి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. వెండితెర పై వళ్ళంతా చూపిస్తూ అంగాంగ ప్రదర్శన చేయడం తన వల్ల కాదని సాయి పల్లవి చెబుతోంది. ఈ ఒక్క కారణంగానే తాను ఎన్నో సినిమాలను వదులుకున్నాన‌ని, అయినా బాధ‌లేద‌ని సాయిప‌ల్ల‌వి చెప్పింది. తాను మొదటి నుంచి కూడా తెర పై ఒక సాధారణమైన కాలేజ్ అమ్మాయిలానే క‌నిపించాన‌ని.. కురచ దుస్తులు వేసుకోవడం, శ్రుతిమించిన వయ్యారాలు ఒలకబోయడం నాకు ఇష్టం ఉండద‌ని చెప్పింది. ఫిదా సినిమాలో ఒక సీన్‌లో కురచ డ్రెస్ వేసుకోవ‌డానికి.. ఆ సన్నివేశానికి అది అవసరం.. అలాగే మరో సినిమాలో కనిపించాలంటే మాత్రం ఒప్పుకోనని.. వత్తిడి చేస్తే ఆ సినిమాను వదులుకుంటాన‌ని తేల్చి చెప్పింది సాయిప‌ల్ల‌వి.

Exit mobile version