ఇప్పుడు బాధ‌ప‌డి ఏం లాభం రాశీ ..!

టాలీవుడ్‌లో మనం సినిమాలో సైడ్ క్యారెక్టర్ తో ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖ‌న్నా.. చూస్తుండ‌గానే స్టార్ హీరోయిన్ గా మారింది. కెరీర్ స్టార్టింగ్ నుండి అందాలు ఆర‌బోయ‌డంలో హ‌ద్దులు దాట‌ని రాశీ ఖ‌న్నా, వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ సినిమాలో ఏకంగా బోల్డ్ స‌న్నివేశాల్లో న‌టించి సినీ జ‌నాల‌కు ఒక్క‌సారిగా షాక్ ఇచ్చింది. వరల్డ్ ఫేమస్ లవర్ విజ‌య్ దేవ‌రకొండ‌తో బెడ్ సీన్స్‌లో న‌టించిన రాశీ ఖ‌న్నా అప్పుడేవో క‌థ‌లు చెప్పి ఇప్పుడు తెగ బాధ ప‌డిపోతుంది.

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా విడుదల కాకముందే.. ట్రైలర్‌తో రాశీఖన్నా సంచలనం రేపింది. సినిమా విడుద‌ల‌కు ముందు ఇదే విషయాన్ని రాశీ ఖన్నాను ప్రశ్నిస్తే.. బోల్డ్ రోల్స్ చేస్తే ఇంకా ఎక్కువ ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంద‌ని అక్కడ మీరు చూడాల్సింది ఎమెషన్ అని.. అందుకే తగ్గట్టే నటించాన‌ని.. బోల్డ్ నెస్ చూడకూడదంటూ కవరింగ్ ఇచ్చింది. అయితే అంత చేసినా ఆ సినిమా అట్ట‌ర్ ప్లాప్ అవ‌డంతో రాశి చేసిందంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరైంది.

ఇక చివ‌ర‌కు ఆమె ఫ్యాన్స్ నుండి కూడా ట్రోల్స్‌కు గురైంది. దీంతో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో బోల్డ్ నెస్ ఉన్న క్యారెక్టర్ చేసి పెద్ద తప్పు చేశాన‌ని తెలిపింది. ఆ సిన‌మాలో బెడ్ సీన్స్ ఇష్టం లేకుండానే చేశాన‌ని, ఆ సీన్స్ కార‌ణంగా రాశి తెగించేసింద‌ని, చాలామంది మెసేజ్‌లు పెట్టార‌ని, త‌న పై బ్యాడ్ ఇంప్రెష‌న్ ప‌డిపోయింద‌ని, ఇక‌ముందు ఇలాంటి పాత్ర‌లు చేయ‌న‌ని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ‌. దీంతో మొత్తానికి గట్టి ఎదురు దెబ్బ తగిలితే కానీ.. రాశిఖన్నాకు అస‌లు తత్వం బోధ పడలేదని సినీ స‌ర్కిల్స్‌లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Exit mobile version