కరోనా దెబ్బకి ‘ఎఫ్ 3’ వచ్చే ఏడాదికే ?


అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేసిన చిత్రం ‘ఎఫ్ 2’. గతేడాది సంక్రాంతికి విడుదలైన చిత్రం ఘనవిజయాన్ని అందుకుంది. ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ ‘ఎఫ్ 3’ రూపొందిస్తామని అప్పుడే అనౌన్స్ చేశారు అనిల్. ఇందులో కూడా వెంకీ, వరుణ్ తేజ్ నటించనున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్ తయారుచేసే పనిలో ఉన్నారు.

అయితే కరోనా కారణంగా ఈ సినిమాని వచ్చే ఏడాదికి పోస్ట్ ఫోన్ చేసారని తెలుస్తోంది. ప్రజెంట్ వెంకీ ‘నారప్ప’ సినిమా పూర్తి చేయాల్సి రావడం, వరుణ్ తేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఒక చిత్రం చేస్తుండటం.. ఈ రెండు సినిమాలు కరోనా కారణంగా ఆగిపోవడంతో ఆ ఎఫెక్ట్ ఎఫ్ 3 మీద పడింది. అందుకే వచ్చే ఏడాదికి ‘ఎఫ్ 3’ని మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.

Exit mobile version