థ్రిల్లింగ్ సబ్జెక్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ విక్రమ్ కె కుమార్. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో నాగచైతన్య. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కబోతుందట. అయితే ఎప్పుడూ సొంత కథలుతోనే సినిమా తీసే విక్రమ్, ఈ సినిమాకి కథ మాత్రం విక్రమ్ రాయలేదని తెలుస్తోంది. బివిఎస్ రవి-దిల్ రాజు జమానాలో రెడీ చేసుకున్న స్క్రిప్ట్‌కు విక్రమ్ తన స్టయిల్‌లో మార్పులు చేసుకుంటున్నారని ఇండస్ట్రీలో టాక్.
కాగా ముందుగా ఈ సబ్జెట్‌ను శతమానంభవతి డైరెక్టర్ సతీష్ వేగ్నిశతో డైరెక్ట్ చేయించాలని దిల్ రాజు అనుకున్నారట. అయితే శతమానం భవతి హిట్ అయినా, ఆ తర్వాత శ్రీనివాసకళ్యాణం ప్లాప్ అవడంతో దిల్ మరోసారి డేర్ చేయడానికి వెనకడుకు వేసి, ఈ సబ్జెక్ట్‌ను విక్రమ్ చేతుల్లో పెట్టారని తెలుస్తోంది. మరి ఈ టైపు సబ్జెక్ట్‌ను విక్రమ్ ఎలా డీల్ చేస్తారో చూడాలి.