దేవరకొండ సామాజిక బాధ్యతలో భాగం అవుతానన్న కొరటాల.

హీరో విజయ్ దేవరకొండ కరోనా క్రైసిస్ సందర్భంగా ఏర్పడిన దుర్భర పరిస్థితులను ఎదుర్కోవడానికి సామాన్యులకు చేయూతనివ్వడానికి ముందు కొచ్చారు. దీనికోసం ఆయన రెండు ఛారిటీ సంస్థలను ఏర్పాటు చేశారు. ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్(టి డి ఎఫ్), మిడిల్ క్లాస్ ఫండ్ (ఎం సి ఎఫ్) అనే రెండు ఛారిటీ విభాగాలను స్టార్ట్ చేశారు. విజయ్ చేపట్టిన ఈ సామాజిక సేవకు దర్శకుడు కొరటాల శివ మద్దతు ప్రకటించారు. తను మొదలుపెట్టిన ఈ మంచి పనిలో తన తోడు సాయం ఎప్పుడూ ఉంటుందని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.

శివ కొరటాల హృదయపూర్వక స్పందనకు దేవరకొండ కృతజ్ఞతలు తెలిపారు. ఓ సామాజిక సేవా కార్యక్రమం పై శివ కొరటాల స్పందనకు ప్రశంశలు అందుతున్నాయి. తనలో సేవా గుణం ఉండబట్టే తన సినిమాలలో కథలు సామాజిక సమస్యలు లేవనెత్తుతాయని అర్థం అవుతుంది. శివ కొరటాల కెరీర్ బిగినింగ్ నుండి తీసిన అన్ని చిత్రాలలో ఎదో ఒక సోషల్ కాన్సెప్ట్ ని టచ్ చేయడం జరిగింది. ఇక ఆయన లేటెస్ట్ మూవీ ఆచార్య కూడా సోషల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న చిత్రమే. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

https://twitter.com/sivakoratala/status/1254314073438613504?s=09

Exit mobile version